హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్‌జిల్లా దొంగ అరెస్ట్.. రూ.84 లక్షలు స్వాధీనం

సత్యసాయి: వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా నిందితుడు శ్రీనివాసులును అరెస్ట్ చేసినట్లు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. నిందితుడి నుంచి రూ.84 లక్షల విలువైన 47 తులాల బంగారం, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. 20కి పైగా కేసుల్లో ప్రమేయం ఉన్న నిందితుడు తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేసేవాడని ఎస్పీ తెలిపారు.