హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జెడ్పీ పాఠశాలలో ఎంఈఓ పరిశీలన

VZM: పెరుమాలి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎంఈఓ త్రినాథరావు బుధవారం సందర్శించారు. పాఠశాల ప్రార్థన, విద్యార్థుల హాజరు, ప్రశస్తి వీడియోలు, విద్యాశక్తి అమలు తీరును పరిశీలించారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటకాల తయారీ, మిషన్–27, మరుగుదొడ్ల నిర్వహణ, ప్రయోగశాల పనితీరును పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.