హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటాం'

VZM: జామి మండలం చింతాడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు గోకులం షెడ్లు మంజూరుకు కృషి చేస్తామని ఎస్.కోట MLA లలిత కుమారి హామీ ఇచ్చారు. బుధవారం ఆమె ప్రమాద స్దలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రమాదంలో 12 పశువుల పాకలు, 4 గడ్డివాములు, 4 ధాన్యపు పురులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకుంటామన్నారు.