హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణపతి నవరాత్రి ఉత్సవాలకు రాట ముహూర్తం

E.G: కడియం మండలం కడియపులంక గ్రామ దేవతైన శ్రీ ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద శ్రీ విద్యాలక్ష్మి గణపతి నవరాత్రి మహోత్సవాలకు పందిరి రాట మహోత్సవంతో అంకురార్పణ జరిగింది. ఈ పూజా కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాలు 4వ వార్షికోత్సవానికి చేరుకున్న నేపథ్యంలో గతంలో కంటే మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.