హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో కొనసాగుతున్న వరుణ యాగం

తిరుమలలో వరుణ యాగం కొనసాగుతోంది. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వరుణ యాగం రేపటితో ముగియనుంది. రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.