హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో సందడి చేసిన సినీ హీరో

E.G: ప్రముఖ సినీ హీరో నాగార్జున రాజమండ్రిలో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన అభిమానులతో ముచ్చటించారు. చాలా కాలం తర్వాత రాజమండ్రి రావడం ఆనందంగా ఉందని నాగార్జున పేర్కొన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు ఉత్సాహంగా తరలివచ్చారు. నాగార్జునతో ఫొటోలు దిగేందుకు, మాట్లాడేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.