హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బీచ్‌లో భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు..!

VSP: రుషికొండ బీచ్‌లో భారీగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోయాయి. బీచ్ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల బీచ్ అందాలు దెబ్బతినడమే కాకుండా పర్యావరణానికి విఘాతం కలుగుతోందని వాపోతున్నారు. తక్షణమే స్పందించి వ్యర్థాలను తొలగించాలని వారు కోరుతున్నారు.