హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ప్రకాశం: కంభంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు కంభం పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై శివకృష్ణ తెలిపారు.