హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకులోయలో వైఎస్ఆర్ వర్ధంతి

ASR: అరకులోయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు. పేదల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు తెచ్చిన మహానేత వైఎస్ఆర్ అని ఆయన కొనియాడారు.