AKP: కోటవురట్ల మండలం నుంచి రైతులను తీసుకొని బస్సులు ఉదయం 10.55 గంటలకు బయలుదేరి వెళ్లాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ఫుడ్ స్టాక్ పాయింట్ నుంచి భోజనం ప్యాకెట్లను బస్సులో వెళుతున్న రైతులకు అధికారులు అందజేశారు. మండలం నుంచి 100 బస్సుల్లో రైతులు వెళుతున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. వీరందరిని సాయంత్రం వారి గ్రామాలకు తీసుకొస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోటవురట్ల నుంచి బయలుదేరిన బస్సులు


