హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అమలాపురం మంత్రి నాదెండ్ల రాక?

కోనసీమ: అమలాపురంలో పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై జనసేన కార్యకర్త రోళ్ల ప్రేమ్‌కుమార్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. అతడికి నివాళులు అర్పించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్‌ నేడు అమలాపురం రానున్నట్లు సమాచారం. బెండమూర్లంకకు చెందిన ప్రేమ్‌కుమార్‌ మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.