NTR: జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెంలో అభిమానులు, జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ భారీ ఫ్లెక్సీల వద్ద అభిమానులు, యువకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు


