కృష్ణా: గుడివాడ మండలం మోటూరు గ్రామంలో ఇంటి బీరువా లాకర్‌ను పగులగొట్టి బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసును గుడివాడ రూరల్ పోలీసులు బుధవారం ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మోటూరు గ్రామానికి చెందిన తాడిపర్తి అశోక్‌కుమార్‌ను అరెస్ట్ చేసి, రూ.4.20 లక్షల విలువైన 48.014 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు గుడివాడ రూరల్ సీఐ సోమేశ్వరరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చోరీకి గురైన రూ.4.20 లక్షల బంగారం స్వాధీనం


