హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్‌డీటీ శిక్షణతో మహిళలకు ఆటోల పంపిణీ

ATP: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ) మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నెల రోజులపాటు ఆటో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న 22 మంది మహిళలకు ఆటోలను బుధవారం పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత ఒంటరి మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, జీవనోపాధి కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వహకులు తెలిపారు. సంస్థ ఇప్పటివరకు 45 మందిని ఆదుకుంది.