ప్రకాశం: బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో బుధవారం విషాదం జరిగింది.పాముకాటుకు గురై,వెంకటలక్ష్మి అనే మహిళ రైతు మృతి చెందింది.గ్రామ సమీపంలోని పొలంలో గడ్డి కోస్తుండగా వెంకటలక్ష్మిని పాము కాటు వేసింది.తోటి రైతులు గమనించి వెంటనే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్న సమయంలో వెంకటలక్ష్మి మృతి చెందింది.ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పాము కాటుకు గురై, మహిళ మృతి..!


