హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైదుకూరులో అటెండర్ ఆత్మహత్య

KDP: మైదుకూరు పశు వైద్యశాలలో ఒప్పంద పద్ధతిలో అటెండర్‌గా పనిచేస్తున్న సి. వెంకట సురేశ్‌ (48) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలోని మహిళా సిబ్బందితో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ విషయంపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపానికి గురైన సురేశ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.