హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీతారాంపురంలో 'స్వచ్ఛ పథం' కార్యక్రమం

ELR: ఉంగుటూరు మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం 'స్వచ్ఛ పథం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రత్యేక అధికారి, డిప్యూటీ ఎంపీడీవో జి.రమేష్ బాబు, పంచాయతీ అభివృద్ధి అధికారి జి.బ్రహ్మానందరావు పాల్గొన్నారు. గ్రామంలో పరిశుభ్రత పాటించాలని, చెత్తను రోడ్లపై వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని వారు సూచించారు.