హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భీమవరం-లోసరి హైవే పనులకు ఆమోదం'

W.G: నర్సాపురం పార్లమెంట్ పరిధిలో తీరప్రాంత కనెక్టివిటీని పెంచేందుకు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ విజ్ఞప్తితో CRIF పథకం కింద నిధులు మంజూరయ్యాయి. భీమవరం-లోసరి (NH-216) హైవే అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా రూ.43 కోట్ల తొలిదశ పనులకు ఆమోదం లభించింది. ఈ నిధులతో భీమవరం-దొంగపిండి, గూట్లపాడు రేవు-బర్రెవానిపేట మార్గాల్లో 4-లైన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు.