హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YSR మహానేత: కేతిరెడ్డి పెద్దారెడ్డి

ATP: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను తాడిపత్రిలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని YSR విగ్రహానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించిన మహానేత సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.