హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయాన్ని కారుతో ఢీ కొట్టి పరారీ..!

KKD: కరప మండలం పేపకాయలపాలెంలో కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా వచ్చిన కారు మెయిన్‌ రోడ్డుపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని ఢీకొట్టి ధ్వంసం చేసింది. అనంతరం కొంతదూరం వెళ్లి తిరిగి వచ్చి మరోసారి ఆలయాన్ని ఢీకొట్టి కరప వైపు వెళ్లిపోయింది. ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.