హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పైపులైన్ లీకేజీ.. తాగునీరు వృథా

PPM: వంగర మండలం ఎం.సీతారాంపురం గ్రామంలోని రాజమ్మతల్లి గుడి సమీపంలో తాగునీటి పైపులైన్కు రంధ్రం ఏర్పడింది. దీంతో నీరు పెద్దఎత్తున వృథాగా పోతుండటంతో శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతోందని గ్రామస్థులు తెలిపారు. లీకేజీని అరికట్టాలి అని స్ధానికులు కోరుతున్నారు.