హైదరాబాద్: 28°C
తెలంగాణ

YSకు మంత్రి పొంగులేటి నివాళి

KMM: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వైఎస్సార్‌ను స్మరించుకుంటూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు YS అండగా నిలిచారని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి, వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని కొనియాడారు.