హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమలు: డీఎస్పీ

కోనసీమ: అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 30వ తేదీ వరకు సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని డీఎస్పీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పోలీసుల ముందస్తు లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.