హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెయిన్ అలర్ట్.. మరికాసేపట్లో వర్షం

MHBD: జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు పడతాయని తెలంగాణ వాతారవణ శాఖ అధికారులు తెలిపారు. యాదాద్రి, సూర్యాపేట్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వాన పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.