సంగారెడ్డి జిల్లాలో దక్షిణ కాశీ'గా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయం శ్రావణ బుధవారం నాడు భక్తులతో సంద్రమైంది. పరమశివునికి అర్చకులు శ్రద్ధాభక్తులతో దివ్యాభిషేకాలు, విశేష పూజలు జరిపారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనం పవిత్ర అమృత గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
శ్రీ కేతకీ సంగమేశ్వరునికి విశేష దివ్యాభిషేకాలు


