NGKL: నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరికి చూపు కల్పించవచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.కృష్ణ తెలిపారు. నేత్రదానం చేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
తెలంగాణ
నేత్రదానంపై విద్యార్థులకు అవగాహన


