NLG: వెంకటాద్రిపాలెం పరిధిలోని కేశవనగర్ సమీపంలోని శ్రీమారుతి ట్రేడర్స్ శ్రీరామ బిన్నీ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. తరలించేందుకు సిద్ధంగా ఉన్న 18 క్వింటాళ్ల బియ్యంతో పాటు మినీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.
తెలంగాణ
18 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.!


