WGL: భద్రకాళి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. వేకువజామున అర్చకులు పంచామృతాభిషేకం చేసి, అనంతరం నూతన పట్టు వస్త్రాలు,ఆభరణాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించారు. విశేష అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు నగరంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రాకతో సందడిగా మారింది.
తెలంగాణ
విశేష అలంకరణలో భద్రకాళి అమ్మవారు


