హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి'

KRNL: ఆదోని తహశీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన వేణుగోపాలరావు రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. కార్యాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. తన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధుల్లో అలసత్వం వహిస్తే సస్పెన్షన్‌ తప్పదని స్పష్టం చేస్తూ.. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.