హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడుపాయల క్షేత్రంలో శ్రావణ సంబరాలు

MDK: ఏడుపాయల శ్రీ వనదుర్గాభవానీ అమ్మవారు శ్రావణ, బుధవారం సందర్భంగా భక్తులకు విశేష అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి సుందరంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మంజీరా నదిలో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం భక్తజనసందోహంగా మారింది.