హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మౌజన్‌, హఫీజ్‌ల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి

NDL: నంద్యాలలో మంగళవారం మంత్రి ఫరూక్‌ను మౌజన్‌లు, హఫీజ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. మౌజన్‌లకు ఉచితంగా టిడ్కో ఇళ్లు, ఇమామ్‌లు, అలీమ్‌లు, హఫీజ్‌లకు కేటగిరీ-2, 3 కింద ఇళ్లు కేటాయించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు న్యాయం చేసే అంశాన్ని పరిశీలించి, సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి ఫరూక్ హామీ ఇచ్చారు.