BHPL: అప్పుల బాధతో సింగరేణి ఉద్యోగి కృష్ణ చైతన్య (32) పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన ఆయన రామగుండం ఆర్జీ-3లో ఓర్మెన్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై వెళ్లిన ఆయన మల్హర్ మండలం కొయ్యూర్–పీవీనగర్ మధ్య అటవీ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
సింగరేణి ఉద్యోగి ఆత్మహత్య


