హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

నిర్మల్‌ పట్టణం విద్యుత్‌ ఉపకేంద్రం పరిధిలో మరమ్మతుల పనుల కారణంగా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని పట్టణ ఏడీఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రామ్ రావు బాగ్, బంగల్పేట్, బేస్తవారిపేట్, బోయవాడ, గాంధీచౌక్, నాయుడువాడ పరిసర ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.