హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుగ్గ ఆలయ ట్రస్టు బోర్డుకు నోటిఫికేషన్

MNCL: బెల్లంపల్లి మండలం బుగ్గ రాజేశ్వర స్వామి దేవస్థానానికి నూతన ట్రస్టు బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 20 రోజులలో నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మూడేళ్లుగా దేవాలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయలేదు. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.