హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: న్యాయమూర్తి

BDK: జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్‌ 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత తెలిపారు. పెండింగ్‌ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు లోక్‌ అదాలత్‌ మంచి అవకాశమన్నారు. లోక్‌ అదాలత్‌లో కేసులకు తుది పరిష్కారం లభిస్తుందని, తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉండదని ఆమె తెలిపారు.