హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ ఏడాది దొరకని పులస చేపలు

కోనసీమ: పులస చేపలు ఆశించిన స్థాయిలో దొరకకపోవడంతో మత్స్యకారులతో పాటు పులస ప్రియులు కూడా నిరాశ చెందుతున్నారు. ఈ సీజన్లో కేవలం 4 పులసలు మాత్రమే లభ్యం కావడం పరిస్థితికి అద్దం పడుతుంది. జూలైలో ఒక పులస వలకు చిక్కి రూ.14 వేలు పలుకగా, ఆగస్టులో యానాం రేవులో జరిగిన వేలంలో 1.3 కిలోల బరువున్న ఓ పులస ఏకంగా రూ.24 వేల ధర పలికింది.