హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి'

MDK: నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని డీసీహెచ్ శివదయాల్ సందర్శించి వైద్య సేవలు, సౌకర్యాలను తనిఖీ చేశారు. మాతృ, శిశు సంరక్షణతో పాటు శస్త్రచికిత్సలు, అసాంక్రమిక వ్యాధుల సేవలపై అధికారులతో సమీక్షించారు. బాధితులకు వేగంగా, నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, భోజన వసతి, సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.