హైదరాబాద్: 28°C
తెలంగాణ

బడి పిల్లల భవిష్యత్ గురువుల చేతుల్లోనే: కలెక్టర్

SDPT: తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని జిల్లా కలెక్టర్ కే.హైమావతి స్పష్టం చేశారు. మంగళవారం టీటీడీసీ భవనంలో ఎంఈఓలు, హెచ్‌ఎమ్‌లతో నిర్వహించిన సమీక్షలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వివరాలను పరిశీలించారు. చదువుతో పాటు విద్యార్థుల సమగ్ర వికాసానికి కృషి చేయాలని ఆదేశించారు.