KMR: వానాకాలం పంటల సాగునీటి అవసరాల కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఇవాళ ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నీటి విడుదలతో కాలువలో ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున రైతులు గొర్రెల కాపరులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలువలోకి దిగడం దాటేందుకు ప్రయత్నించడం చేయరాదని హెచ్చరించారు. పశువులను కాలువలోకి దింపవద్దని కోరారు.
తెలంగాణ
నేడు నిజాంసాగర్ నీటి విడుదల


