హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు

MDK: రామాయంపేట సమీపంలోని కోమటిపల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట నుంచి నార్సింగ్ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నర్సంపల్లికి చెందిన రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు.