హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వృద్ధుల సంక్షేమంపై న్యాయ సేవాధికార సంస్థ దృష్టి'

తూ.గో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యార్లగడ్డ శ్రీలక్ష్మి మంగళవారం రాజమండ్రిలోని గౌతమి జీవకారుణ్య సంఘాన్ని సందర్శించారు. అక్కడ వృద్ధులకు కల్పిస్తున్న వసతులు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు ఏవైనా న్యాయపరమైన సమస్యలు లేదా న్యాయ సహాయం అవసరమైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ హెల్ప్‌లైన్ 15100ను సంప్రదించాలని సూచించారు.