హైదరాబాద్: 28°C
వార్తలు

22 మందిని బలగొన్న కేసులో కీలక పరిణామం

ఢిల్లీ మాల్వియా నగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 22 మంది మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై పోలీసులు ఛార్జీషీట్‌ను కోర్టుకు సమర్పించారు. హోటల్ యాజమాని లవ్‌కేష్ బజాజ్‌తో పాటు మరో ఇద్దరిని ప్రధాన నిందితులుగా చేర్చారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, నిర్లక్ష్యం వహించటం వంటి అంశాలపై వీరిపై ఛార్జీషీట్ దాఖలు చేశారు.