హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీఎం సూర్య ఘర్ పనులు పరిశీలించిన కలెక్టర్

సత్యసాయి: జాగరాజుపల్లిలో పీఎం సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల నాణ్యతను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 11,987 ఇళ్ల లక్ష్యానికి 8,687 ఇళ్లలో ఇన్స్టాలేషన్లు పూర్తయ్యాయి. మిగిలిన 2,300 ఇళ్ల పనులను సెప్టెంబర్ ఆఖరుకు పూర్తి చేయనున్నారు.