WNP: కొత్తకోట మండలంలోని కానాయిపల్లి కోటిలింగేశ్వర దేవస్థానంలో సంకష్టహర చవితిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు గణపతికి పంచామృతాలు, భస్మగంధం, కుంకుమజలాలు, శుద్ధజలాలతో అభిషేకం చేశారు. అనంతరం గణపతిని ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలతో మహా మంగళహారతి సమర్పించారు.
తెలంగాణ
VIDEO: కానాయిపల్లిలో ఘనంగా సంకష్టహర చవితి


