హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి వనరులను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే

ATP: ​అనంతపురంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. జిల్లాలో సాగునీటి లభ్యత, రైతుల సాగు అవసరాలపై అధికారులతో చర్చించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.