హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి ఖోఖోకు జిల్లా విద్యార్థినులు

PLD: నకరికల్లు జెడ్పీ హైస్కూల్‌లో నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ ఖోఖో జట్టుకు కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్థినులు బి.సౌజన్య, కె.బుజ్జి ఎంపికయ్యారు. వీరు సెప్టెంబర్ 13–15న కంచికచర్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఎంపికైన వారిని ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు, పీడీ ఈదర ఆదిబాబు అభినందించారు.