SDPT: ప్రముఖ జానపద, సినీ గాయకురాలు 'పుష్ప' ఫేం మౌనిక యాదవ్ కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు. ఇటీవల వివాహం జరిగిన సందర్భంగా భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చిన ఆమె దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
తెలంగాణ
కొమురవెళ్లి మల్లన్న సేవలో గాయని మౌనిక యాదవ్


