హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డిజిటల్ లేబర్ చౌక్‌లో పేరు నమోదు చేసుకోండి'

ATP: గుత్తి పట్టణంలో భవన నిర్మాణ కార్మికులు తమ పేర్లను డిజిటల్ లేబర్ చౌక్ యాప్‌లో నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ అధికారి వెంకటరాముడు మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు ఎలక్ట్రిషన్లు కార్పెంటర్లు, పెయింటర్లు , తమ మొబైల్ ఫోన్లో DLC యాప్ డౌన్లోడ్ చేసుకుని తద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.