హైదరాబాద్: 28°C
తెలంగాణ

'5వ తేదీ లోపు వివరాలు నమోదు చేసుకోండి'

BHPL: ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వడ్లను వానాకాలంలో సాగు చేస్తున్న రైతులు రూ.500 బోనస్ పొందేందుకు పంట రకాన్ని నమోదు చేసుకోవాలని రేగొండ AEO భరత్ తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన ఫర్టిలైజర్‌ షాప్‌ డీలర్‌ను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 5వ తేదీ లోపు వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.