హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల కోసం ఉచిత ఆరోగ్య పరీక్షలు'

CTR: పుంగనూరులో NTR సంజీవిని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్‌ మధు ఆధ్వర్యంలో బీపీ, షుగర్‌తో పాటు పలు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేశారు. వైద్యుల సూచన మేరకు అవసరమైన వారికి మందులను ఉచితంగా అందించారు. గ్రామీణ, పేద ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు కల్పించడమే తమ లక్ష్యమని డాక్టర్‌ తెలిపారు.